వైశ్య సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ లింగం కు ఘన సన్మానం
– వైద్య వృత్తిలో డాక్టర్ లింగం, శైలజ దంపతులు మంచి గుర్తింపు
– భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
– మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి
గజ్వేల్, 12 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రముఖ వైద్యులు డాక్టర్ లింగం డాక్టర్ శైలజ దంపతులు ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా వైద్య శిరోమణి అవార్డు అందుకున్న సందర్భంగా బుధవారం వైశ్య నాయకులు కలిసి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో డాక్టర్ లింగం డాక్టర్ శైలజ దంపతులను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వైద్య వృత్తిలో డాక్టర్ లింగం డాక్టర్ శైలజ దంపతులు మంచి గుర్తింపు పొంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఇటీవల హైదరాబాద్ లో వైద్య శిరోమణి అవార్డులు అందుకున్న సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, అత్తెల్లి శ్రీనివాస్, నేతి శ్రీనివాస్, రాజేశం, ఉప్పల కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.