రాజా మార్కండేయ సినీ యూనిట్ సందడి
గజ్వేల్ నియోజకవర్గం, 17 ఫిబ్రవరి 2025 : శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన రాజా మార్కండేయ వేట మొదలైంది చిత్ర యూనిట్ సభ్యులు గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆటపాటలతో గెట్ టుగెదర్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బన్నీ యశ్వంత్, ప్రొడ్యూసర్స్ సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్, హీరోయిన్ దేవి, మ్యూజిక్ డైరెక్టర్ మీరా వలి షేక్, కో ప్రొడ్యూసర్ గౌరిశెట్టి శ్రీనివాస్ లు మాట్లాడుతూ శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై చిత్రీకరించిన ఫోర్ ఫౌండర్స్ ఆధ్వర్యంలో రాజా మార్కండేయ వేట మొదలైంది అనే సినిమాను ఎంతో ఇష్టంగా నిర్మించామని, ఈ చిత్రం ఎంతో సందేశాత్మకమైన చిత్ర,మని, ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని, త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ సామ శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్, కో ప్రొడ్యూసర్ గా గౌరిశెట్టి శ్రీనివాస్, విలన్ పాత్రదారులు నగేష్ ,హీరోయిన్ దేవి, సామ నరేష్, గౌరిశెట్టి శ్రీనివాస్ ,పూజారి పాత్రలో మెప్పించిన వంగపల్లి అంజయ్య స్వామి, ఫ్రెండ్స్ పాత్రలో నటించిన సామ నికిత, భార్గవి, డైరెక్టర్ బన్నీ యశ్వంత్ , మ్యూజిక్ డైరెక్టర్ మీరా వలి షేక్, మేకప్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ, బిట్టు, అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, ధరావత్, టెక్నీషియన్స్, చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.