ఆయుష్షు హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సుదర్శన యాగం
– ఆయుష్షు హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
గజ్వేల్ నియోజకవర్గం, 17 ఫిబ్రవరి 2025 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వరదరాజ పూర్ గ్రామంలో వరదరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎర్రవల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ సందడి చేశారు. అనంతరం గ్రామస్తులు నిర్వహిస్తున్న సుదర్శన యాగం, ఆయుష్షు హోమం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయని, వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను తిడుతూ వాళ్లిద్దరు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసిందని, ఆ రెండు పార్టీల కుట్రలు ఇక్కడ నడవవని, బీసీ కుల గణనను పక్కదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి మోడీ బీసీ అనే మాటకు తెరలేపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వంకర టింకర మాటలు చెప్పి ఆగం చేసుడే తప్ప దేనికి పరిష్కారం చూపించే పాపాన పోలేదన్నారు. మోడీ ది, రాహుల్ గాంధీ ది ఏ కులం అయితే మాకేంటని, మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలను పరిష్కరించాలని, బీసీ కుల గణనను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్, బిజెపి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ డ్రామా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కుల గణనను చిత్తశుద్ధి తో నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.

Join WhatsApp

Join Now