కర్కపట్ల లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కర్కపట్ల లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

గజ్వేల్ నియోజకవర్గం, 17 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని గ్రామ కెసిఆర్ అభిమానుల ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పూలభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని, ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువ నాయకుడు రాళ్ల బండి బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేసీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుని వేడుకున్నామని అన్నారు. రాబోయే కాలంలో మళ్లీ కెసిఆర్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బింగి నర్సింలు, మధు గౌడ్, సత్యం గౌడ్, దిలీప్ కుమార్, సత్యనారాయణ, శ్రీకాంత్ సాయి గౌడ్, నాగరాజు, బాలరాజు, బాబు గౌడ్, సాయి చరణ్, మైస కృష్ణ, మహేందర్ గౌడ్, పెంటయ్య, బాలరాజు, వెంకటేష్, బాల చారి, ప్రశాంత్, చిన్న, సత్యనారాయణ, చాకలి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now