వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయం

వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయం – శ్రీమతి బండ్రు శోభారాణి

యాదాద్రి భువనగిరి జిల్లా, 19 ఫిబ్రవరి 2025 : వంగపల్లి అంజయ్య సేవలు అభినందనీయమని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బండ్రు శోభారాణి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న బండ్రు శోభారాణి. ఈ సందర్భంగా శ్రీమతి బండ్రు శోభారాణి మాట్లాడుతూ ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయని అన్నారు. అనంతరం వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23-02-2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా శ్రీమతి శోభారాణి కి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది అని అన్నారు.

Join WhatsApp

Join Now