కో-ఆర్డినేటర్లు సమిష్టిగా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి…
*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..
జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం
పదేళ్లు కేంద్రo,రాష్ట్రoలో అధికారంలో ఉన్న ,బిజెపి,బి ఆర్ ఎస్ పార్టీలు నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేశారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కో-ఆర్డినేటర్ల సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సమీక్ష సమావేశానికి జమ్మికుంట పట్టణ,వీణవంక మండల కో-ఆర్డినేటర్స్ హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి,పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక్క ఓటు కూడా తప్పకుండా ఓటు వేసే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు.పట్టభద్రుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలోనే వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని అన్నారు.గడచిన ఏడాదిలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం 55,000 వేల ఉద్యోగాలు ఇచ్చిందని,నియామకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ గూడెపు సారంగపాణి మొలుగూరి సదయ్య మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ ఎగ్గెటి సదానందం చెన్నవేన రమేష్ నాయకులు మ్యాకమల్ల అశోక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.