యూరియా లేదన్న వదంతులు నమ్మవద్దు

*యూరియా లేదన్న వదంతులు నమ్మవద్దు*

*జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్*

*జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం*

యూరియా సరిపడా స్టాకు లేదన్న వదంతులు రైతులు నమ్మవద్దని జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఎండి ఖాదర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు యాసంగి పంట సాగు కోసం అవసరమైన యూరియా మండలానికి అందజేయటం జరుగుతున్నదనీ యూరియా స్టాక్ లేదు అన్న వదంతులను నమ్మి రైతు సోదరులు ఆందోళన చెందవద్దనీ జమ్మికుంట మండలంలోని మూడు సహకార సంఘాలలో సరి పడ యూరియా నిలవలను ఉంచడం జరుగుతున్నదనీ ప్రస్తుతం 30 టన్నుల యూరియా సహకార సంఘాలలో ఉన్నదనీ వివరించారు. రేపటి వరకు అదనంగా 100 టన్నుల యూరియా ను అందుబాటులో ఉంచడం జరుగుతున్నదనీ దశల వారిగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయడం జరుగుతుందని తెలిపారు రైతులు భయాందోళనలు గురై అవసరానికి మించి కొనడానికి ప్రయత్నించవద్దని రైతు సోదరులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment