కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కెపిహెచ్బి కాలనీలో పర్యటన
కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ శనివారం కెపిహెచ్బి కాలనీలో పర్యటించారు. మలేషియా టౌన్షిప్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు పారిశుద్ధ నిర్వహణ, వెలగని వీధిదీపాలు టౌన్షిప్ పక్కనే ఉన్న పార్కులో సీనియర్ సిటిజన్స్ కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి జోనల్ కార్యాలయంలో చౌహాన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా వారు కోరారు అంతకుముందే వీరు సమస్యలను బండి రమేష్ వద్ద పేర్కొనడంతో ఆయన కాలనీ వాసులతో కలిసి పార్కును టౌన్షిప్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఆయన జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో చౌహాన్ శనివారం ఆయా ప్రాంతాలను, పార్కును పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించారు దీంతో కాలనీవాసులు హర్షo వ్యక్తం చేశారు ఇన్చార్జి బండి రమేష్ కి జోనల్ కమిషనర్ చౌహాన్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.