దొడ్డి కొమరయ్య పోరాటమే మన ఆదర్శం కావాలి
బింగి స్వామి కురుమ కె అర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
పట్టు పట్టి పోరాడుదాం హక్కులను సాధించుకుందాం
విద్యకు దూరం రాజకీయాలకు అడవులకు దగ్గర
కురుమల జీవనశైలి మారాలి
ఐక్యంగా పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు
సిద్దిపేట ఆగస్టు 15 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేర్ పల్లి గ్రామంలో గొర్రెల కాపరులచే దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి కురుమ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి రైతాంగ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య అందరికీ ఆదర్శమని ఆయన విగ్రహాన్ని స్వతంత్ర దినోత్సవం రోజు ఏర్పాటు చేసుకోవడం కురుమల ఐక్యతకు నిదర్శనం అన్నారు. కురుమలు అన్ని రంగాల్లో ముందుండాలంటే విద్య ముఖ్యమని ఎవరిని మధ్యలోనే చదువులు ఆపేయొద్దని గ్రామస్తుల్ని కోరారు. విద్య ఉంటే ఆర్థికం రాజకీయం మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాయన్నారు. గొర్రెల కాపరులుగా అనేక సమస్యలు పడుతున్న మనం మన పిల్లలను సమస్యలకు దూరంగా ఉంచాలని అధునాతన పద్ధతిలో గొర్రెలు పెంచడం గొంగల్లు నేయడం అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వాలు దేనికి సహాయ సహకారాలు అందించి సబ్సిడీలు అందించాలని కోరారు. విద్య పరంగా దూరం ఉండబట్టే అడవులకు దగ్గర
రాజకీయాలకు దూరంగా ఉన్నామని కురుమల జీవనశైలి మారాలని భవిష్యత్ తరాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనీ అవి విద్య ద్వారానే అందిపుచ్చుకోవాలన్నారు. మారుమూల గ్రామమైన శేర్ పల్లి లో దొడ్డి కొమురయ్య విగ్రహం పెట్టుకోవడమే ఐక్యతకు నిదర్శనమని ఈ ఐక్యతను ప్రతి గ్రామంలో కొనసాగించి కురుమలు రాజకీయ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు కదం తొక్కలన్నారు. గొర్రెల స్కీమ్ కోసం డీడీలు కట్టిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారికి గొర్రెలు వెంటనే మంజూరు చేస్తారా లేదా డీడీలు వాపస్ ఇస్తారా అని ప్రశ్నించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కురుమలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా కౌన్సిలర్ లుగా ఎన్నిక కు ప్రతి పార్టీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు చిగుళ్ల భాషయ్య, చిగుళ్ల మహేష్, గట్ల ఐలయ్య గట్ల వెంకటయ్య, ర్యవ లింగం, గట్ల చిన్న ఐలయ్య, మొగుళ్ళ శంకర్, కొన్నాల ఐలయ్య, గడ్డం బిరయ్య, డోలు బిరయ్యా, బిక్షపతి, గడ్డం మల్లెష్, ర్యావ సురేష్, మొగుళ్ళ రాజు, ర్యవ రాజు, గట్ల శ్రీను కురుమ సంఘం నాయకులు పాల్గోన్నారు.