ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం

ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఓటర్లకు ధన్యవాదాలు
– రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షరెడ్డి 
గజ్వేల్ నియోజకవర్గం, 27 ఫిబ్రవరి 2025 : ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి అన్నారు, గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించిన ఆంక్షరెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, బిజెపి మాటలకే పరిమితమైన పార్టీ అని, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడం లో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని,  కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాండ కనకయ్య గౌడ్, పాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి , ర్యాకం యాదగిరి, గోవర్ధన్, తిరుపతి రెడ్డి, గుర్రాల నర్సింలు, సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now