గజ్వేల్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
– రాయారావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా పురస్కారం
– పలువురు మహిళలకు దక్కిన పురస్కారాలు
గజ్వేల్, 08 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో శనివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు రాయారావు విశ్వేశ్వర్ రావు, వారి అక్క, చెల్లెళ్ళు,కుటుంబ సభ్యుల సహకారంతో వారి మాతృమూర్తి కీ,శే. శ్రీమతి రాయారావు విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి పేరిట సమాజంలో వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ఆరుగురు మహిళామణులకు ఉత్తమ మహిళా పురస్కారాలు 2025 కు గాను అందించారు. పురస్కారాలు పొందిన వారు శ్రీమతి చాడ పద్మ, శ్రీమతి కొరిడె హరిణా పవన్, శ్రీమతి అష్టకాల శారద, శ్రీమతి ఉప్పల మాధవి, శ్రీమతి బ్రహ్మాండం గాయత్రీ రమణమూర్తి, శ్రీమతి డాక్టర్ జంపన శ్రీ సంధ్య దేవి. సంధాన కర్తగా రాయారావు యువ గాయకురాలు శివాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, స్వావలంబన తో సమాజంలోని అన్ని పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్.సీ. రాజమౌళి మాట్లాడుతూ మగువ సృష్టికి మూలం, మహిళలను గౌరవించడం మన విధి అని అన్నారు. పురస్కారాలు పొందిన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వేశ్వర్ రావును అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు రాయారావు విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ మా మాతృమూర్తి పేరిట దాదాపు 48 మందిని ఎంచుకొని అందులో వారి అమ్మ, నాన్నలకు ఉన్న గొప్ప లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆరుగురు మహిళలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు రామ్మోహనరావు, రాజేశ్వర్ రావు, ఉప్పల మెట్టయ్య, స్వర్గం చంద్రయ్య, అరుణ, వసంత లక్ష్మి, మంజుల, వంటేరు ఉమ, లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.