మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

– ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు

– ఆడ కూతురికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత కేసీఆర్ ది

– గోదావరి జలాలతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్ల నీరు

– గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి 

గజ్వేల్, 08 మార్చి 2025 : మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారిని గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి మూలమైన స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని,మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే మహిళా మూర్తుల పాత్ర అత్యంత కీలకమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు, గత సమైక్య పాలనలో తాగడానికి మంచినీళ్లు లేక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లమీద ధర్నాలు చేసే వారిని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన సురక్షితమైన నల్ల నీరును అందించి మహిళలను రోడ్ల మీదకు రాకుండా చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. మహిళలకు భరోసాగా మేనమామ కానుకగా మహిళలను ఆడబిడ్డలను గౌరవిస్తూ కల్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడ కూతురికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారం అందించడం కోసం న్యూట్రిషన్ కిట్టు అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కెసిఆర్ కిట్టు ద్వారా తల్లి పిల్లలకు కావలసిన సామాన్లు కెసిఆర్ కిట్టు రూపంలో అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కేసిఆర్ ది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్లను అందజేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అదే కాకుండా వితంతువులకు వృద్ధులకు, వికలాంగులకు నేరుగా పెన్షన్లను వారి ఖాతాలో జమ చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలో మైనార్టీ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినిలకు కావలసిన వసతులను కల్పించి నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ లో నాణ్యమైన భోజనాన్ని అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీ, కౌన్సిలర్లు వంటేరు ఉమా గోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, బబ్బురి రజిత, తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, గుంటుకు శిరీష రాజు, మరి కంటి వరలక్ష్మి కనకయ్య, పంబాల అర్చన శివ, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, అత్తిలి మాధవి శ్రీనివాస్, చీర్ల శ్యామల మల్లేశం, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అరుణ భూపాల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మంజులా రెడ్డి, సునీత, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కౌన్సిల్ మెంబర్ కోల సద్గుణ, అల్వాల బాలేష్, కో ఆప్షన్ సభ్యులు ఉమర్, అహ్మద్, ఫర్జానా, రజియా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now