చేబర్తిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

చేబర్తిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

గజ్వేల్ నియోజకవర్గం, 08 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్, గ్రామ పంచాయతీ మాజీ పాలక వర్గం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లకు, సఫాయి కార్మికులకు చిరు సన్మానం చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా శక్తి మహోన్నతమైనదని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిద్దేశ్వర్, తాజా మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి, మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు జాలని యాదగిరి,చిన్ని కృష్ణ,నాయకులు జయరాం, తోట బాలకృష్ణ, టప్ప రాజు, చంద్రం, అనిల్, రాంబాబు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now