మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలు
డిజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్.
మంగళగిరి: మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిధిలో చిన్నారులపై జరిగిన ఆఘాయిత్యాల (POCSO) కేసుల్లో నిందితులకు 3 నెలల నుండి 6 నెలల లోపే శిక్షలు ఖరారు చేయడంలో విజయం సాదించిన విజయనగరం పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారు శిక్షల నుండి తప్పించుకోలేరని అన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలను నివారించడానికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో “వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” ను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు “శక్తి” యాప్ ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ శక్తి యాప్ కు పలు అదునాతన ఫీచర్ లను జోడించడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు టోల్ ఫ్రీ నంబర్స్ 181, 112, 1098,1093 కు కాల్ చేసినా లేదా మొబైల్లో ఉన్న శక్తి యాప్ లో గల ‘SOS’ మీట నొక్కినా లేదా ఫోనును అటూ, ఇటూ గట్టిగా ఉపినా కంట్రోల్ రూమ్ కి సమాచారం వెళ్లి నిమిషాల వ్యవధిలోనే శక్తి టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణగా నిలుస్తాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేదింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడమే లక్ష్యంగా శక్తి టీమ్స్ పనిచేస్తాయి అని అన్నారు.
విజయనగరం జిల్లా పోలీస్ అధికారులు చేదించిన POCSO కేసుల వివరాలు:
1. Cr.No. 126/2024 (POCSO కేసు – రామభద్రపురం PS)
సంఘటన జరిగిన తేదీ: 13.07.2024 – శిక్ష ఖరారు తేదీ: 16.12.2024 (6 నెలల లోపు)
• 5 నెలల పసికందుపై లైంగిక దాడి మరియు అత్యాచారం
• విజయనగరం జిల్లా రామబద్రపురం మండలం, జన్నివలస పంచాయాతి నేరెళ్ళవలస . గ్రామానికి చెందిన బోయిన ఎరుకన్నదొర (40 సం.లు. – సమీప బంధువు) ఐదు నెలల పసికందుపై లైంగిక దాడి.
• 6 నెలల లోపే నిందితుడికి పోక్సో కేసు ద్వారా 25సం.ల కఠిన కారాగార శిక్ష రూ.5,000/-లు జరిమానా విధించిన న్యాయస్థానం.
2. Cr.No. 90/2024 (POCSO కేసు – మహిళా పోలీస్ స్టేషన్, విజయనగరం)
సంఘటన జరిగిన తేదీ : 27.10.2024 – శిక్ష ఖరారు తేదీ: 10.03.2025 (4.5 నెలల లోపు)
• మూడున్నర సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారిపై అత్యాచారం
• విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారుబిల్లి గ్రామంలో ఘటన. గ్రామానికి చెందిన విసినిగిరి రవి (31సం.లు) కుటుంభ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన మూడున్నర సం.ల వయస్సు కలిగిన మైనరు బాలికపై లైంగిక దాడి.
• 134 రోజుల్లోనే పోక్సో నాయస్థానం నిందితుడికి 25సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/-లు జరిమానా విదించింది.
3. Cr.No. 277/2024 (POCSO కేసు – పూసపాటిరేగా PS)
సంఘటన జరిగిన తేదీ: 11.11.2024 – శిక్ష ఖరారు తేదీ: 10.02.2025 (3 నెలల లోపు)
• 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారిపై అత్యాచారయత్నం.
• విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, పెద్దపతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీష్ అనే ముద్దాయి (19 సం.లు) అదే గ్రామానికి చెందిని 5 సంవత్సరాల మైనరు బాలికపై లైంగిక దాడి.
• 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విదించిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం.
4. Cr.No. 101/2024 (POCSO కేసు – మహిళా పోలీస్ స్టేషన్, విజయనగరం)
సంఘటన జరిగిన తేదీ: 19.11.24 – శిక్ష ఖరారు తేదీ: 28.02.25 (3 నెలల 10 రోజులు)
• 7 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికపై ఆటో డ్రైవర్ (55 సం.) లైంగిక దాడి.
• 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 3,000 జరిమానా విదించిన పోక్సో న్యాయస్థానం.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కేసుల విచారణ, వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఆధునిక న్యాయ, ఫోరెన్సిక్ సాంకేతికతలను ఉపయోగిస్తూ నేరస్తులను శిక్షించేందుకు ఉద్దేశించిన చర్యలను బలోపేతం చేయడంతో పాటు బాధితుల హక్కులను కాపాడేందుకు, చట్టపరమైన ఆలస్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు.
క్రమశిక్షణను పరిరక్షిస్తూ, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కృషి చేస్తోందని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు.
జారీ చేసినవారు: ఆంధ్రప్రదేశ్ డిజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ వారి కార్యాలయం, మంగళగిరి