రెండవ రోజుకు చేరిన మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి దీక్ష 

రెండవ రోజుకు చేరిన మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి దీక్ష

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టిన దీక్ష బుధవారం కు రెండవ రోజుకు చేరుకుంది. ఆగస్టు ఒకటవ తారీకు న భారత ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ ఇది న్యాయమైనదే అని సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తూ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణను అమలు చేస్తానని మాట ఇచ్చినారనీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దగా కోరు ముఖ్యమంత్రి మాలలకు తొత్తుగా పనిచేస్తూ గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3 నిమకాలకు ఆదేశాలిస్తూ వర్గీకరణను అన్సివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ వన్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మీ యొక్క మంత్రివర్గంలో మాదిగలకు ఇద్దరికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, కామారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు కొత్తల్ల యాదగిరి, కామారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు కొత్తూరు సాయిలు, కామారెడ్డి జిల్లా వికలాంగుల అధ్యక్షులు కోల బాలరాజ్ గౌడ్, రాష్ట్ర వికలాంగుల ఉపాధ్యక్షురాలు నల్లబల్ల సుజాత, కామారెడ్డి జిల్లా నాయకులు నయీముద్దీన్, జమాల్ భాయ్, సదాశివ నగర్, మండల్ వికలాంగుల అధ్యక్షులు నా రెడ్డి, నల్లబల్ల నాగరాజు, నాగమణి మాదిగ తదితరులు పాల్గొన్నరు. కన్నాపూర్ ఎమ్మార్పీ స్ గ్రామ కమిటీ అధ్యక్షులు కర్రోళ్ల రాజలింగం ( మాదిగ ) రామారెడ్డి మండలం ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment