వ్యవసాయ విస్తరణ అధికారులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈరోజు అనగా రోజున చుంచుపల్లి రైతు వేదిక నందు వాలంటరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు .దీనిలో భాగంగా ఈరోజు ఎం అనిత డైరెక్టర్ ఆఫ్ జనరల్ వాలంటరీ వారు మాట్లాడుతూ ఏ ఈ ఓ లు అందరూ కూడా రైతులకు సాయిల్ కన్జర్వేషన్ మరియు నీటిని ఎలా పొదుపు చేస్తూ వ్యవసాయ దిగుబడులు ఎలా సాధించాలని పేర్కొన్నారు. తక్కువ నీటిని వాడి అధిక దిగుబడులను సాధించాలని తెలియజేశారు అదే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం నుండి సైంటిస్ట్ నవీన్ కుమార్ వారు మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజు గ్రామాలలో రైతుల పంట పొలాలను గమనిస్తూ అదే విధంగా వారికి తగు సూచనలు చేస్తూ ప్రస్తుతం ఉన్న కొత్త పద్ధతులను రైతుల వద్దకు చేరవేస్తూ వారికి సూచనలు ఇవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా ఏవో అన్నపూర్ణ గారు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం లోని పద్ధతులు తెలియజేస్తూ రైతులకు రసాయన ఎరువులు తగ్గించి జీవన ఎరువుల ద్వారా భూమి యొక్క సాంద్రతను కాపాడవచ్చునని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి బాబు రావు గారు, వాలంటరీ జెడిఎ గౌరీ గారు ఏ డి ఏ సునీత గారు,ఏవో ,జిల్లాలోని ఏఈఓస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment