కార్లు తాకట్టు పెట్టి కోటి 16 లక్షలు కుచ్చుటోపి పెట్టిన నిర్మల్ వాసి.?

: కార్లు తాకట్టు పెట్టి కోటి 16 లక్షలు కుచ్చుటోపి పెట్టిన నిర్మల్ వాసి.? వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణానికి చెందిన కోమటి అభిలాష్ అనే వ్యక్తి ఇతరుల దగ్గర కారు రెంటుకు తీసుకొని ఆర్మూర్ పట్టణానికి వచ్చి తాకట్టు పెడతాడు అలా చాలా కార్లు ఆర్మూర్లో తాకట్టు పెట్టి దాదాపు కోటి 16 లక్షలు తీసుకొని పారిపోయాడు. కార్లు ఎవరైతే అద్దెకు ఇచ్చా రో వాటి యజమానులు నిర్మల్ టౌన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి అతనిపై కేసు నమోదు చేసి ఆర్మూర్ లో ఉన్న కార్లను అన్నింటినీ నిర్మల్ టౌన్ పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు విశ్వాసనీయ సమాచారం. దీని వెనుక నిర్మల్ పట్టణానికి చెందిన ఒక లీడర్ ఉన్నాడని ఆర్మూర్ కు చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. ఇదిలాగా ఉండగా నిర్మల్ పట్టణంలో పింజరిగుట్ట కు చెందిన గొల్ల శేఖర్ ఇతను ద్విచక్ర వాహనాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు ఆ ద్విచక్ర వాహనాలకు ప్రవేట్ ఫైనాన్సుల రుణాలు ఉండంగా ఇతను మళ్లీ ఆ వాహనాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు వాళ్లు కట్టని యెడల ఆ వాహనాలను బయట విక్రయిస్తాడు. ప్రవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఎంత తిరిగినా ఈ వాహనాలు దొరకడం లేదని వాపోతున్నారు. గొల్ల శేఖర్ అనే వ్యక్తికి ద్విచక్ర వాహనాలు పెట్టేందుకు పెద్ద గోదామే ఏర్పాటు చేసుకున్నాడు అతని గోదాములో దాదాపు 100 పైచిలుకు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. అలాగే గొల్ల శేఖర్ వెనకాల నిర్మల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఉన్నట్లు సమాచారం. అందుకే అతనిపైన పోలీసులు కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలుతీసుకోవడం లేదు ఇదంతా తతంగం పట్టణానికి చెందిన కౌన్సిలర్ పోలీసులతో ములకతై ఈ గొల్ల శేఖర్ పై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆపుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇకనైనా అనుమతులు లేకుండా ఫైనాన్స్ ఇస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now