టి.టి ఇన్స్పెక్టర్ రబీనా కు తెలుగు ముంబైకర్ల ప్రశంసలు

*టి.టి ఇన్స్పెక్టర్ రబీనా కు తెలుగు ముంబైకర్ల ప్రశంసలు*

ప్రశ్న ఆయుధం మార్చ్ 13,: ఇటీవల ముంబైలో రుబీనా అకీబ్ ఇనామ్‌దార్ ద్వారా రికార్డ్-బ్రేకింగ్ టిక్కెట్ చెకింగ్ పనితీరుకు ప్రశంశలు పొందుతున్నారు. నగరంలో సెంట్రల్, వెస్ట్రన్, హార్బర్ లైన్లో నడిచే రైళ్ళల్లో ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అందుకే ఈ లోకల్ రైళ్ళను “ముంబై లైఫ్ లైన్” అని అంటారు. ఐతే ముంబై డివిజన్‌లోని తేజస్విని -2 బ్యాచ్‌కు చెందిన ట్రావెలింగ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ (టిటిఐ) రుబీనా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒకే రోజు టిక్కెట్ చెకింగ్ పనితీరులో కొత్త రికార్డు సృష్టించారు. ఈ విశేషమైన రోజున ఆమె మొత్తం 150టిక్కెట్ లేని కేసులను గుర్తించింది. జరిమానాలు పెనాల్టీల ద్వారా మొత్తం 45,705 రూపాయల్ని ఆకట్టుకునే ఆదాయాన్ని ఆర్జించింది. వీరిలో 57మంది సాధారణ కంపార్ట్మెంట్ ప్రయాణికులు ఫస్ట్ క్లాస్‌ టిక్కెట్లు లేకుండా ఏసి, ఫస్ట్ క్లాస్ బొగిల్లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. అయితే ఇలాంటి కృషికి ఆమె అంకితభావం సమర్థత దీనిని నిజంగా “రాక్‌స్టార్ ప్రదర్శన” గా మార్చాయి. ఆమె చేసిన అసాధారణ ప్రయత్నాలను రైల్వే అధికారులు గుర్తించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎం.టి.బి.ఎఫ్) ప్రముఖులైన అహ్మద్ పింజారి, మొహమ్మద్ రజాక్, చాంద్ అహ్మద్ లు రుభీనా కు దిల్సే సలాం తెలిపారు. త్వరలో ఆమెకు సన్మానం చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment