*స్వప్నలోక్ లో ఘనంగా హోలీ సంబరాలు*
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో శుక్రవారం హోలీ పండగను పురస్కరించుకుని కాలనీవాసులు రంగులను చల్లుకుని హోలీ పండగను ఆనందంగా జరుపుకున్నారు. సప్త స్వర్ణాల శోభితమైన, వసంత శోభ వెళ్లివిరిసే వేడుకగా రంగుల కేలి హోలీ పండగలో యువకులు, చిన్నారులు పాల్గొని ఎంతో ఆసక్తితో ఉదయం నుండి రంగులను చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ హోలీ సంబరాల్లో కాలనీవాసులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.