ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు..

ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు..

తన జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం ఒకటని తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారని తెలిపారు. సాధారణంగా ప్రతి గణేష్ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండడంతో పాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు.ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం ఆయన కృపకు పాత్రుడిని కావడం చాలా సంవత్సరాలుగా తనకు అలవాటని అందులో భాగంగా తన జన్మదినం సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment