*వైన్ షాపు వ్యాపారుల నయా దందా.*
*గ్రామాలలో కొట్టు, కొట్టు కు ఏరులై పారుతున్న మద్యం.**
*మద్యానికి బానిస అవుతున్న గ్రామీణ యువత*
*బెల్ట్ షాపుల రద్దు కై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి.* *
*పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.**
ప్రశ్నఆయుధం మార్చి:14 అశ్వరావుపేట నియోజకవర్గం
ములకలపల్లి: వైన్ షాపుల వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి, బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి ములకలపల్లి మండల కేంద్రంలో నెలకొంది.మండల పరిధిలో ములకలపల్లి లో 2 షాపులు అయితే ఒకటే సిండికేట్ షాపుగా, జగన్నాధపురం లో 2 షాపులు అయితే ఒకటే సిండికేట్ షాపు గా మొత్తం 4 షాపులకు బదులు 2 మద్యం దుకాణాల ను మద్యం వ్యాపారులు నడిపిస్తూన్నారు. ములకలపల్లి మండల కేంద్రం ఉండాల్సిన వైన్స్ షాపులు కిలోమీటర్ల దూరం ఉండటంతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. వైన్స్ దుకాణాలను గ్రామానికి దూరం ఉంచి,మండల కేంద్రం లో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూన్నారని,బెల్ట్ షాపులను ఆశ్రయించడం వల్ల ఒక మద్యం బాటిల్ పై 20 నుంచి రూ 30,పుల్ బాటిల్ కి రూ 50 నుండి 100 రూ వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియుల నుంచి ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.మండలం లో ఉన్న నాలుగు మద్యం దుకాణాలు సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేస్తున్నారని పలువురు స్ధానికులు ఆరోపిస్తున్నారు.మద్యం దుకాణాల వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది.ఎటువంటి అనుమతులు లేకుండా పూసుగూడెం ,పోగళ్ళపల్లి, తిమ్మంపేట, చాపరాళ్లపల్లి ఇతర ప్రాంతాల్లో స్టాక్ ఏర్పరచుకొని మద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు విసృతంగా తరలిస్తున్నారు.మండలంలోని ఏ ప్రాంతానికి వెళ్ళిన బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది.గతంలో ఉన్న వాటి కంటే రెట్టింపు లో బెల్ట్ షాపులు ఏర్పాటు తో వైన్స్ షాపుల యాజమానులు జేబులు నింపుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తూ మద్యం వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారని పలువురు స్ధానికులు ఆరోపిస్తున్నారు.మద్యం ప్రియులు బెల్ట్ షాపుల యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తే మా వద్ద వైన్స్ షాపుల యాజమాన్యం క్వార్టర్ కి 10 రూ నుంచి 100 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మేము తక్కువ రేటుకు ఇస్తే నష్ట పోతామని హెచ్చరిస్తూ బెల్ట్ షాపుల యాజమాన్యల అగాడాలు ఇంత అంత లేవని పలువురు వాపోతున్నారు. వైన్స్ షాపులలో దొరకని మద్యం బాటిల్ లు బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని ఇదేక్కడి న్యాయం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఎనీటైం బెల్ట్ షాపులలో మద్యం దొరుకుతుందని 24 గంటలు పాటు బెల్ట్ షాపులు తెరిచి దర్శనమిస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపుల వద్ద అనేక సందర్భాల్లో గొడవలైన సందర్భలు ఉన్నాయి.బెల్ట్ షాపుల దోపిడీ పై ఎవరైన పిర్యాదు చేస్తే, ఇదివరకు కొంతమంది ఎక్సేంజ్ పోలీసులు నిర్వాహకులకు సమాచారం ఇచ్చి నామమాత్రపు దాడులు చేసేవారు.ఆ తర్వాత వారి నుంచి మామూళ్లు వసూలు చేసి బెల్ట్ దందా కు సపోర్ట్ చేస్తున్నారని పలువురు స్ధానికులు వాపోతున్నారు.దీంతో నిర్వాహకులు ఎలాంటి భయం లేకుండానే దందా జోరుగా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.జోరుగా మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తున్నా బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహించి బెల్ట్ షాపులను క్లోజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తూన్నారు.బెల్ట్ షాపులను నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బెల్ట్ షాపుల పై మెరుపు దాడులు నిర్వహించాలని క్వార్టర్ అదనంగా పైసలు వసూలు చేస్తున్న వైన్ షాపు వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు వాపోతున్నారు.