హోలీ సంబరాల్లో అపశృతి

*హోలీ సంబరాల్లో అపశృతి*

*మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి*

*ఇల్లందకుంట మార్చి 14 ప్రశ్న ఆయుధం*

హోలీ సంబరాలు జరుపుకొని బైక్ పై వస్తుండగా రోడ్డు పై నుండి కిందపడిన ఘటన ఇల్లందకుంట మండల కేంద్రం లోని చెరువు సమీపంలో శుక్రవారం రోజున చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి కి చెందిన మ్యాదరి అనుదిప్(15) అనే విద్యార్ధి స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని తన ద్విచక్ర వాహనం పై చిన్న కోమిటిపల్లి నుంచి కొత్తపల్లి గ్రామానికి వస్తున్న క్రమంలో ఇల్లందకుంట మండల కేంద్రం నుంచి చిన్నకోమిటిపల్లి కి వెళ్లే దారిలోని చెరువు సమీపంలో అతివేగంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ రాజకుమార్ తెలిపారు

అనుదీప్ జమ్మికుంట లోని ప్రవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడని తెలిపారు మృతుడి తండ్రి భూమయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు

పండుగ పూట కుమారుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలనుకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment