అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ అండ

ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్ )24 చెక్కులను పంపిణి చేసిన

– అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ అండ

– ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని జిల్లా కార్యాలయం లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్ )24 చెక్కులను దాదాపు 20 లక్షల రూపాయలు లబ్దిదారులకు శనివారం పంపిణి చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ
కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 24 మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం అన్నారు. రుణమాఫీ చేసి చూపించాం, రైతు భరోసా అందిస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రంథాలయం మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్, పండ్ల రాజు, పంపరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment