*మరో పదిహేనేళ్లు ఏపీ సీఎంగా నారా చంద్రబాబే ఉంటారు – కలమట*
కొత్తూరు మండలం :మాతల గ్రామం :
శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి ఆదివారం నాడు కొత్తూరు మండలం మాతల గ్రామంలో ఉన్న తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
సామజిక న్యాయానికి, సంక్షేమం – అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు
నాయుడు.నలబై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయం ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశంలో నెంబర్ వ్యక్తిగా పేరొందిన వ్యక్తి, ఎక్కడైతే సంక్షోభం ఉంటే ఆ సంక్షోభాన్నే ఒక అవకాశంగా మలుచుకొని
ముందుకుసాగే దృష్టి నారా
చంద్రబాబు నాయుడుకే వుంది. ఇటీవల కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మరియు ఉచిత ఇసుక విధానం అలానే ప్రతి పల్లెటూరుకి గిరిజన గ్రామానికి రహదారి సదుపాయలు ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆనాడు విజన్ 2020 అని ఒక డాక్యుమెంటరీని తయారుచేసి ఉమ్మడి తెలుగురాష్ట్రాల అభివృద్ధిపై తనదైన మార్క్ దేశ ప్రజలకు చూపించారు. నేడు అదే దిశగా ముందుకు వెళ్తూ స్వర్ణంద్ర విజన్ 2047 తో ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 30లక్షలమందికి పైగా ఉద్యోగ, ఉపాధి కల్పించి ఐటి విప్లవం తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో తెలుగు వారిని పెద్ద పెద్ద ఉద్యోగస్తులుని చేశారు. దేశంలోకి ఎక్కడా లేని విధంగా మహిళకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా పక్షపాతిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి మా సీఎం చంద్రబాబు అని కలమట తెలిపారు.