ఎంపీ రఘునందన్ రావును కలిసిన గజ్వేల్ బిజెపి నాయకులు
గజ్వేల్, 23 మార్చి 2025 :
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో వారి నివాసంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి మన్నేం శశిధర్ రెడ్డి, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, గజ్వేల్ పట్టణ సీనియర్ నాయకులు నాయిని సందీప్ కుమార్, మాడ్గురి నరసింహా ముదిరాజ్, మంద వెంకట్, హరి కుమార్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.