విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
– టిఎన్ఎస్ఎఫ్ మోడల్ ఎంసెట్,నీట్ ఎంట్రెన్స్ విజేతలకు బహుమతుల ప్రదానం
– ప్రశ్న ఆయుధం కామారెడ్డి
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్, విఆర్ కె అకాడమీ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టి ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని సాధించుకోవడానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు. విద్యార్థులు నిరాశ దరిచేరకూడదని కష్టపడితే ఎంతటి విజయమైన దక్కుతుందని అన్నారు.ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయిందని ఆ పోటీలో నిలబడాలంటే సరియైన శిక్షణ అవసరమని సూచించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ జైపాల్ రెడ్డి కి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరపున కృతజతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్కే విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి సహకరించామని అన్నారు. విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంస ప్రశంస పత్రాలతో అభినందించరు. ఈ కార్యక్రమంలో విఆర్ కె అకాడమి ప్రోగ్రాం ఇన్చార్జి జలిగామ శ్రీకాంత్, సమన్వయ కర్త నవీన్,ఎస్ఆర్ కె ప్రిన్సిపాల్ దత్తాద్రి, జూనియర్ ప్రిన్సిపాల్ నరేష్ అధ్యాపక బృందం శంకర్,మల్లేష్,ధర్మపురి,శేఖర్,రంగనాయకులు,మహేష్,మహేందర్,మధు,నవీన్ లు పాల్గొన్నారు.