చలివేంద్రం ఏర్పాటుచేయడం అభినందనీయం సిఐ సైదా నాయక్ 

*చలివేంద్రం ఏర్పాటుచేయడం అభినందనీయం*

గజ్వేల్ CI సైదా నాయక్

ప్రశ్న ఆయుధం గాజ్వెల్ :

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని గజ్వేల్ సీఐ సైదా నాయక్ అన్నారు. మంగళవారం ధర్మారెడ్డిపల్లి లో అదే గ్రామానికి చెందిన ప్రగతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సీఐ సైదా నాయక్ జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిని నర్సింహులుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో బాటసారులు దాహార్తిని తీర్చేందుకు ముందుకురావడం అభినందనీయం అని ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నదని,నిత్యం పరిసర గ్రామాల నుంచి వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు యువత చెడు అలవాట్లకు పోకుండా గ్రామభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారు సూచించారు అందరూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి ఎన్నో గ్రామభివృధి కీ ఉపయోగపడు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందికు సాగుతున్న ప్రగతి యూత్ అసోసియేషన్ వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now