*మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన: ఎమ్మెల్యే యశస్విని..*
*పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఇటీవల తెలంగాణ శాసనసభ సమావేశాల్లో పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ సమస్యపై ప్రస్తావించారు. ఆ ప్రాంత ప్రజలు గణనీయంగా ప్రయాణించే పాలకుర్తి బస్టాండ్ తగిన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, బస్టాండ్ అభివృద్ధి అవసరం ఉందని అసెంబ్లీలో సమర్థంగా మాట్లాడారు.* ఈ అంశంపై దృష్టి పెట్టి హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో *రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో ఎమ్మెల్యే బస్టాండ్ అభివృద్ధి అంశాన్ని మంత్రికి వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని, పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంట పాలకుర్తి బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యన్నారాయణ, దేవరుప్పుల మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, తదితరులున్నారు.