అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కూనoనేనికి ఘనంగా సన్మానం జరిగింది

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 29

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనoనేని సాంబశివరావుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా శనివారం సన్మాన కార్యక్రమం జరిపారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్ జడ్పిటిసి,ఎంపీటీసీ రిజర్వేషన్ అమలు చేయాలని శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించినందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతంలో లక్షలాదిమంది ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ గత ప్రభుత్వం కెసిఆర్ హయంలో తొలగించి అన్యాయం చేశారని ప్రజాపాలన ప్రభుత్వంలో న్యాయం జరిగేంతవరకు కూనంనేని అండగా నిలవాలని కోరారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ప్రస్తావించడం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు ఎంతో మనోధైర్యాన్ని కలిగించినందుకు ఎమ్మెల్యే సాంబశివరావుకు ప్రత్యే కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి గౌరవ సలహాదారు అంబేద్కర్ వాది డాక్టర్ మద్దెల శివకుమార్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు గోడ్ల మోహన్ రావు, చదలవాడ సూరి,మాజీ ఎంపీటీసీ దారా శ్రీనివాసరావు,ఎనగంటి అర్జున్ రావు, కొమ్ము శ్రీరామ్,కర్లపూడి సుందర్ పాల్, మంద వెంకటేశ్వర్లు,కండె రాములు,గిరిశం,ఎనగంటి శ్రీనివాసు, గుర్రం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now