గజ్వేల్, 04 ఏప్రిల్ 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సిద్దిపేట జిల్లా ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు నరేష్ రెడ్డి ,సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సంతోష్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు హనుమాన్ దాస్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఫ్లెక్సీ ప్రింటర్స్ వ్యాపారం రోజు రోజుకు నష్టాల్లో వెళుతుందని ముడి సరుకు ధరలు పెరిగిన ఫ్లెక్సీ ప్రింటర్స్ రెట్లు పెంచడం లేదని త్వరలోనే మనం అందరం కలిసి నిర్ణయించే ధరల ప్రకారం ముందుకు సాగాలని అన్నారు. పోటీ తత్వానికి వెళ్లి మనం నష్టపోకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం ఫ్లెక్సీ ప్రింటర్స్ వారికి అండగా ఉండాలని ఆకాంక్షించారు. సామాన్యులను అసామాన్యులను చేసేదే ఫ్లెక్సీ ప్రింటర్స్ అని, ఫ్లెక్సీ ప్రింటర్స్ వారికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఖదీర్, శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సిద్దిపేట జిల్లా కోశాధికారి అనిల్ కుమార్, గజ్వేల్ నియోజకవర్గం ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్, జనరల్ సెక్రటరీ అనిల్ గౌడ్, కోశాధికారి వెంకట్ గౌడ్, కార్యవర్గ సభ్యులు, లక్ష్మీనారాయణ, శేఖర్, పాష, రామకృష్ణ, నవీన్, కరుణాకర్, హరి గౌడ్, నర్సింలు, నరేష్, సతీష్, కరుణాకర్, సునీల్, బాలగోని రేఖ గౌడ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
Published On: April 4, 2025 7:39 pm
