*ఆహార కల్తీ మహమ్మారి పై అంగన్వాడి కేంద్రాల్లో చైతన్య సదస్సు*
* *తల్లిదండ్రులలో అవగాహన కల్పించిన భారత వినియోదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి.*
ప్రశ్న ఆయుధం ఎప్రిల్ 4 : నిజామాబాద్ జిల్లాఅధ్యక్షులు పెందోట అనిల్ ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, పౌడపెల్లి అనిల్ ల ఆద్వర్యంలో ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 ప్రకారం, ప్రతీ ఆహర పదార్థాల ప్యాకింగ్ పై తయారీ తేదీ, వాడకం గడువు తేదీ, బరువు, నాణ్యతా వివరాలు ముద్రింప బడి ఉంటాయి. ఇట్టి వివరాలను క్షుణ్ణంగా గమనించి, అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశము పై చైతన్య సదస్సు జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CCI భారత వినియోగదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు. ఉప్పు, పప్పులు, వంటనూనెలు మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు లు ప్లాస్టిక్ సంచుల్లో అమ్మకం జరుగుతున్నందున మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి చేరడం, క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ ప్యాకింగ్ వలన అయోడిన్ ఉప్పు లక్ష్యం వృధా అయిపోతున్నదని, కాబట్టి అన్ని రకాల ఉప్పు తయారీ దారులు ప్లాస్టిక్ కవర్ లలో ప్యాకింగ్ చేయరాదని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒక వేళ ప్యాకింగ్ లో చేస్తే, ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు ప్యాకింగ్ పై ముద్రించాలని తెలిపారు. కాని వివిధ రకాల అయోడిన్ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్ కవర్ లలో ఉప్పు ప్యాకింగ్ చేసి, చిన్న పిల్లలతో సహా అందరికీ క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నారని సందు ప్రవీణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఆర్మూర్ డివిజన్ అనిల్,సంయుక్తకార్యదర్శిలు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్,రూరల్ ఇంచార్జీ కార్యదర్శులు యాటకర్ల దేవేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్, అంగన్వాడి వెల్పర్స్, విద్యార్థిని విద్యార్థులు బాలింతలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొని వంట నూనెలు, కందిపప్పు, ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వ లలో జాగ్రత్తల పై నేడు ఆర్మూర్ లోని మగ్గిడి , అలుర్ సెంటర్ లలో గీత, మమత అంగన్వాడీ కార్యకర్తలను చైతన్య వంతులను చేశారు.