గజ్వేల్, 04 ఏప్రిల్ 2025: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికైన హనుమాన్ దాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన గజ్వేల్ సామాజిక కార్యకర్త సాదక్ పాషా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజు ఫంక్షన్ హాల్ నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త సాదక్ పాషా మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడు హనుమాన్ దాస్ గజ్వేల్ నియోజకవర్గం ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థి సమయంలోనే ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకొని, అంచలంచలుగా ఎదిగి పట్టణంలో ఫ్లెక్సీ ప్రింటర్స్ దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేసుకొన్నారని, హనుమాన్ దాస్ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు.
హనుమాన్ దాస్ ను సన్మానించిన సాదక్ పాషా
Published On: April 4, 2025 8:12 pm
