ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

*ఘనంగా గ్రాడ్యుయేషన్ డే*

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 4: బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న యూకేజీ విద్యార్థులు ఈ సంవత్సరం ఒకటో తరగతిలో వెళుతున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నామని చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు తెలిపారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు వేదికపై ప్రదర్శించిన విధానం చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ బొట్ల విజయలక్ష్మి, కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపాల్ బొట్ల ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ బొట్ల మంజుల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment