*కన్నుల పండుగగా శ్రీరామ పట్టాభిషేకం*
*పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్*
*
* ఏప్రిల్ 7 ప్రశ్న ఆయుధం*
సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాములవారి పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు రాములోరి పట్టాభిషేకానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు మొదట కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు పట్టాభిషేకానికి మేళ తాళాల మధ్య తీసుకువచ్చి పట్టాభిషేక మహోత్సవంలో పాలుపంచుకున్నారు ఆలయ అర్చకులు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు స్వామివారి పట్టాభిషేక మహోత్సవంలో అర్చకులు పట్టాభిషేకం యొక్క మహత్యాన్ని భక్తులకు కూలంకుశంక వివరించారు పట్టాభిషేకంలో పాలు పంచుకోవడం అంటే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలమని అర్చకులు అభివర్ణించారు స్వామివారికి బంగారు పుష్పాలతో పూజ కైంకర్యాలు నిర్వహించారు బంగారు పుష్పాలను తయారు చేయించిన దాతలకు పట్టాభిషేకంలో పాలుపంచుకున్న దాతలకు స్వామి యొక్క మంగళా శాసనాలు కల్పించి స్వామివారి వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు అనంతరం కట్టంగూరి వంశీల చేత ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ స్వీకరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టంగూరి అనిల్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి కట్టంగూరి వంశీయులు బంగారు పుష్పాల దాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు