*ఈ నెల 11న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ*
*జమ్మికుంట ఏప్రిల్ 9 ప్రశ్నఆయుధం*
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద జమ్మికుంట మండలానికి వచ్చిన 233 మంది లబ్ధిదారులకు చెక్కులను హుజూరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 11 శుక్రవారం రోజున ఉదయం.10 గంటలకు హుజూరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయబడునని జమ్మికుంట తహసిల్దార్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమం అనంతరం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.