రాములోరి కళ్యాణం విజయవంతం చేసిన ఏసీపి పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు -ఆలయ చైర్మన్ రామారావు

*ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాములోరి కళ్యాణం విజయవంతం చేసిన ఏసీపీని పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు*

*శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మెన్ ఇంగిలే రామారావు*

*ఇల్లందకుంట ఏప్రిల్ 9 ప్రశ్న ఆయుధం*

శ్రీ శ్రీ రామ నవమి సందర్భంగా అపర భద్రాద్రిగా పేరు పొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాములోరి కళ్యాణాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసిన ఏసీపీని మర్యాదపూర్వకంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామారావు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు బుధవారం రోజున హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో ఏసీబీ సిహెచ్ శ్రీనివాస్ జి ని ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ఆలయ ధర్మకర్తలు కలిసి వారిని శాలువాతో సన్మానించి సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని అందజేశారు జరగనున్న బ్రహ్మోత్సవాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు భక్తులకు స్వామివారి దర్శనం అయ్యే విధంగా చూడాలని కోరారు కళ్యాణం కోసం అహర్నిశలు కష్టపడ్డ పోలీసులకు తమ పాలకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట ఆలయ ధర్మకర్తలు గోడిషాల పరమేష్ గోలి కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now