పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల..  మార్క్ శంకర్ ఆరోగ్యంపై డాక్టర్స్ ఏమన్నారంటే..

*పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల..*

*మార్క్ శంకర్ ఆరోగ్యంపై డాక్టర్స్ ఏమన్నారంటే..*

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‏లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీమ్ అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

“మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు” అంటూ జనసేన పార్టీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని.. దైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment