ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలి

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలి

-ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 17, కామారెడ్డి :

ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ జాబితా సవరణపై జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ సీఈవో మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్-2025)లో భాగంగా బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో) ద్వారా ఈనెల 20వ తేదీ నుండి ఇంటింటా ఓటర్ జాబితాల పరిశీలన చేపట్టాలన్నారు.
ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు 1, తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు చేపడుతున్నట్లు వివరించారు. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆర్డిఓ లను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులకు శిక్షణను అందించి ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామాల మార్పు, చేర్పుల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. జాబితా నుంచి మృతుల వివరాల తొలగింపునకు మరణ ధ్రువీకరణ పత్రం లేదా పంచనామా రికార్డులు తప్పనిసరిగా చూపాలని చెప్పారు. ఈ వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో తప్పనిసరిగా సమావేశం ఏర్పాటుచేయాలని వివరించారు.
ఓటరు జాబితాలో సాంకేతికంగా ఎలాంటి తప్పులు లేకుండా, ఓటరు సవరణ, మార్పులు చేర్పులు వంటివి చేపట్టి ఈ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామం, మండలం వారిగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి ఓటరు లిస్టులో పేర్ల నమోదు, వాటిలో మార్పులు, చేర్పులను చేయాల్సి ఉంటే పక్కాగా నిర్వహించాలని వివరించారు. అలాగే గ్రామాలు, వార్డుల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షించిచే సమయంలో ఆయా చోట్ల చనిపోయిన ఓటర్లను గుర్తించి వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వారం రోజుల గడువు తర్వాత పేర్లను తొలగించాలని, జాబితాలో ఫొటో తప్పుగా నమోదు అయిన వాటిపై చర్యలుతీసుకోవాలని అన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ పై వచ్చే ఆదేశాలను పాటించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఆర్టీవో రంగనాథ చారి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now