యూనిక్ హాస్పటల్ వారి మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి..

*యూనిక్ హాస్పటల్ వారి మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి..*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సంత ఆవరణంలో బుధవారం నాడు యూనిక్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బిపి, షుగర్ టెస్టులను చేయించుకున్నారు. మెడికల్ క్యాంపు కి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను వైద్య సిబ్బంది ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, కలిసేటి కొండయ్య, నాయకులు కోలా రంజిత్ కుమార్, వెంపటాపు భారతి, వైద్యులు భవాని, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment