*ఏ.వీ.ఎమ్ హైస్కూల్ వార్షికోత్సవం*
*- కరస్పాండెంట్ బోసాని బాలరాజు
*ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21 కుత్బుల్లాపూర్*
విద్యార్థులు విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం అందుకునే పట్టా తదుపరి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఏవిధంగా తోడ్పడుతుందో.. ప్రాథమిక విధ్య ఒకటవ తరగతిలోకి అడుగు పెట్టడానికి ముందు ప్రీ ప్రైమరీ విద్యాభ్యాసం నర్సరీ, ఎల్ కేజీ, యుకెజి పూర్తి చేసిన చిన్నారులను ప్రోత్సహించడంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం జరుగుతుందని ఎవిఎం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ బోసాని బాలరాజు తెలిపారు. గాజులరామారం డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్ లోని ఎవిఎం ఉన్నత పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్తహాసంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో బుడిబుడి నడకల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
వివిధ రకాల వేషధారణ ప్రదర్శనలతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెప్పు పొందారు.
విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ బోసాని బాలరాజు, ప్రధానోపాధ్యాయురాలు బోసాని అనూష గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లను అందించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పొందిన చిన్నారులను అభినందించారు.