భద్రత పథకం ద్వార పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసాజిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత, ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేసిన జిల్లా ఎస్పీ

– భద్రత పథకం ద్వార పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా

– చనిపోయిన పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం

– జిల్లా ఎస్పీ

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

IMG 20250421 WA0015

భద్రత పథకం పోలీసు కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ ఆర్థిక భరోసా కల్పిస్తుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ డి.రామన్ , పి సి – 1512 కుటుంబానికి పోలీసు భద్రత నుండి మంజూరైన 8,00000/- లక్షల చెక్కును, రామన్ భార్య అనురాధ , కుమార్తె అఖిల కుటుంబసభ్యులకు కలిసి

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర భద్రత చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసు శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. భద్రత స్కీమ్ ద్వారా చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమములో పోలీసు కార్యాలయం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now