ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ సావంత్ పదవి విరమణ

*ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ సావంత్ పదవి విరమణ*

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22: ముంబైలోని బి.ఎం.సి విద్య విభాగంలో తన విధి నిర్వహించిన పిజికల్ టీచర్ సునీల్ సావంత్ పదవీ విరమణ పొందారు. ఆయన మొత్తం 30ఏండ్లు 9నెలల పాటు విద్యార్థుల కోసం సేవలు అందించారు. తొలుత ఫిజికల్ టీచర్ గా కామాటిపుర హిందీ మున్సిపల్ స్కూల్లో 3ఏండ్లు, టాగోర్ నగర్ హిందీ స్కూల్లో 15ఏండ్లు, అనంతరం ఏ.బి.సి.డి వార్డులకు జూనియర్ సూపర్ వైజర్ గా, ఎన్ వార్డుకు 3ఏండ్లు. చివర్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ గా చక్కగా తమ విధులు నిర్వహించారని ప్రెసిడెంట్ ప్రిన్సిపాల్ సత్యశీల కాంబ్లే, ముఖ్యఅతిథి సీనియర్ సూపర్‌వైజర్ దత్తు లవేటే ఆయనను ప్రశంసించారు. మంగళవారం ముంబైలోని గిల్డర్ ట్యాంక్ పాఠశాల హాల్లో సత్కారమూర్తి సావంత్ రిటైర్డ్మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం తాను సైంటిఫిక్ దృకోణం ద్వారా విద్యార్థులకు సేవలందించానని, తమ ఉపాధ్యాయ వర్గం కూడా అందజేస్తారని, దేశాన్ని శాస్త్రీయ దేశంగా తీర్చిదిద్దే బాధ్యతను నెరవేరుస్తారని విజ్ఞప్తి చేశారు. ఇందులో అతిథులుగా మాజీ సీనియర్ సూపర్‌వైజర్ రాజేష్ గాడ్గే, ధైర్యధర్ పాటిల్, వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ సావంత్, తాత్యా లవ్టే హాజరైయ్యారు. సన్మాన సభకు వ్యాఖ్యాతగా జూనియర్ సూపర్‌వైజర్ అనిల్ సానర్ వహించారు. ఉపాధ్యాయ వర్గానికి రుచికరమైన భోజనాలు అందించారు.

 

.

Join WhatsApp

Join Now