రైల్వే ట్రాక్‌పై మహిళ ఆత్మహత్య యత్నం
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి టౌన్ బ్లూ కోర్ట్ పోలీసుల వేగమైన స్పందనతో మహిళ ప్రాణాపాయం నుండి సోమవారం రాత్రి బయటపడిందనీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కామారెడ్డి టౌన్ బ్లూ కోర్ట్ సిబ్బంది సాహసోపేత చర్యకు వారిని అభినందిస్తున్నానన్నారు. రాత్రి సుమారు 9 గంటల 20 నిమిషాల సమయంలో, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూ కోర్ట్ – 1 బృందంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పి సి – 2577 బీ. నరసింహులు హోంగార్డు – 412 ఆర్. వసంత్‌కు డ్యూటీ సమయంలో ఒక అత్యవసర కాల్ వచ్చింది. ఆ కాల్‌లో, జయశంకర్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక మహిళ ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు సమాచారం రాగా, సమాచారం అందిన వెంటనే సదరు బ్లూ కోర్ట్ బృందం వేగంగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మహిళ ను రైల్వే ట్రాక్‌పై నుండి సురక్షితంగా రక్షించారన్నారు.తదనంతరం బాధిత మహిళకు మానసిక స్థైర్యం కలిగించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి, తగిన పర్యవేక్షణ కోసం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన బ్లూ కోర్ట్ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించడం జరిగిందన్నారు.