*నాగారంలో అంబేద్కర్ జయంతి: సహపంక్తి భోజనంతో సమానత్వ సందేశం*
* బీజేపీ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనం
* అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వం, సౌభ్రాతృత్వం చాటిచెప్పిన నాయకులు
* కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22
నాగారం ఎస్సీ బస్తిలోని ఎర్ర వామన్ ఇంట్లో బీజేపీ నాయకులు సామూహిక భోజనం ఏర్పాటు చేసి, ‘సహపంక్తి భోజనం’ ద్వారా సామాజిక సమానత్వానికి మద్దతు తెలిపారు. నాగారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భోజనం అనంతరం కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించేందుకు మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ఏకత్వ భావనతో జీవించాలని, సమాజంలోని అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికీ సమాన పాత్ర ఉండాలని, అందుకే అందరూ కలిసి భోజనం చేస్తూ అంబేద్కర్ ఆలోచనలను అనుసరిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్లు బుధవరం లక్ష్మి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, మాజీ అధ్యక్షులు బుద్ధవరం వేణుగోపాల్, నాయకులు రామక్కపేట రవీందర్ రెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వరరావు, కౌకుట్ల రాహుల్ రెడ్డి, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, జూపల్లి నరేష్, భువనేశ్వరి మాధవరావు, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మారబోయిన రాజశేఖర్, షాజీ నాయర్, విజయలక్ష్మి, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.