శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రు. 20,69,829/-

శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రు. 20,69,829/-

బంగారం,వెండి, విదేశీ డబ్బు అదనం

పెరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆదాయం రు.2,94,257

IMG 20250422 WA2781

ఏప్రిల్ 22 ప్రశ్న ఆయుధం

IMG 20250422 WA2780 భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ20,69,829 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ఆలయ ఈవో కందుల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9:00 గంటలకు కరీంనగర్ డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు పి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ రామారావు ఈవో కందుల సుధాకర్ కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కింపు జరగగా హుండీ ఆదాయం రూ20,69,829, 12 గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి,225 యుఎస్ డాలర్స్,15 అరబ్ ధీరమ్స్, ఒక కువైట్ దినార్, ఐదు చైనీస్ యుహాన్, వెయ్యి జపాన్ యెన్స్ వచ్చినట్లు వారు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రూ2,94,257 ఎక్కువ ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు

పరమేశ్వర్,రవికిరణ్,గోపాల్ రెడ్డి, మల్లేష్,కిషన్ రెడ్డి, లావణ్యశ్రీనివాస్,చిరంజీవి,రామ్ రెడ్డి,నాగరాజు,మధుకర్ రెడ్డి,నారాయణ రెడ్డి,రాజేందర్,తిరుపతి రెడ్డి ఆలయ అర్చకులు,మడిపల్లి వాలంటీర్లు జమ్మికుంట శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now