వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయలి

వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయలి

– జీవనాభృతి సంవత్సరానికి 12000/-రూ అమలు చేయాలి

– రెండు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కార్మికుల డబ్బులు విడుదల చేయాలి.

– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త ఉపాధ్యక్షుడు బి కిషోర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయలనీ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త ఉపాధ్యక్షుడు బి కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60 శాతం మంది వ్యవసాయంపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇందులో 85 శాతం మంది చిన్న సన్నకారు రైతులు, మొత్తం రైతుల్లో 50 శాతం కి పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55 శాతం పైగా వ్యవసాయ కూలీలు

ఉన్నారు. వీరికి ఏడాది పొడవునా పని దొరకడం లేదు. పని దొరికిన కూలితో కుటుంబం నడవక. పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లి అక్కడ మున్సిపాలిటీ కార్మికులుగా డ్రైనేజీల్లో పనిచేస్తున్న పరిస్థితి వ్యవసాయ కార్మికులకు నెలకొంది అని ఆయన అన్నారు. గ్రామాల్లో ఉపాధి పనికి వెళ్తే సరైన కూలీ చెల్లించకపోగా కూలి డబ్బులు సకాలంలో రావడం లేదు అని అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12 వేలు జీవనాభృతి ఇస్తానని హామీని తుంగలోతొక్కి. వ్యవసాయ కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అంబానీ అదానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలను పట్టించుకున్న నాధుడే లేడు అని అన్నారు. సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి.

3 ఎకరాల లోపు భూమి కలిగిన వారిని వ్యవసాయ కార్మికులుగా గుర్తించాలని.గీత, చేనేత, బీడీ కార్మికులకు ఇస్తున్న నెల పెన్షన్ రూ “2000/- ప్రకారంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కూలీలకు నెలకు రూ “2000/- ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల డబ్బులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. లేనిపక్షంలో తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయలను ఉపాధి కార్మికులతో ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రకాష్, కిషోర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now