నాగారం నీటి కష్టాలు తీర్చండి: కాంగ్రెస్ నాయకుల వినతి

*నాగారం నీటి కష్టాలు తీర్చండి: కాంగ్రెస్ నాయకుల వినతి*

*జలమండలి అధికారులకు వినతి పత్రం సమర్పణ*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 23

రాజ్ సుక్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన జలమండలి కార్యాలయాన్ని నాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. స్థానిక నీటి సమస్యలపై అధికారులకు వినతి పత్రం సమర్పించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డిలను కలిసి, నాగారం ప్రాంతంలో రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

నాగారం ప్రాంతంలో నీటి సరఫరా సరిగా లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు జలమండలి అధికారుల దృష్టికి తెచ్చారు.రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని వారు విజ్ఞప్తి చేశారు.నాయకుల వినతిని సానుకూలంగా పరిగణించిన అధికారులు, త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో

ముప్పు శ్రీనివాస్ రెడ్డి (నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు),

మాజేటి వేణుగోపాల్ (16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు),

దాసు (రాజ్ సుక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్),

బాబురావు (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు),

మాదిరెడ్డి రాజిరెడ్డి (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)

నాగారం ప్రాంత నీటి సమస్య పరిష్కారానికి జలమండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now