కేసీఆర్ సభకు బ్రేక్ ⁉️

*Big Breaking ; కేసీఆర్ సభకు బ్రేక్ ⁉️*

రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ

కమిషన్ విచారణకు కేసీఆర్ , హరీష్ రావులకు నోటీసులు

హైదరాబాద్;కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్‌ భావిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తోన్న కమిషన్ రేపటి నుంచి రెండోదశ దర్యాప్తును ప్రారంభించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే మొదటి దశలో ప్రాథమికంగా విచారణ నిర్వహించింది. ఇప్పుడు రెండో దశలో మరింత లోతుగా దర్యాప్తు జరగనుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు, వివరణలు నమోదు చేయనుంది.

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై సమగ్రంగా ఆరా తీసే క్రమంలోనే ఈ దర్యాప్తు జరుగుతోంది. కమిషన్ గడువు ఈ నెలలో ముగియనున్నందున, మరో రెండు నెలల పాటు గడువు పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అవకతవకల పరంగా అనుమానాలున్న ప్రాజెక్టుల వివరాలు, ఒప్పందాలు, పనుల నాణ్యతపై కూడా ఈ దశలో దృష్టి కేంద్రీకరించనుంది.

కేసీఆర్ , హరీష్ రావు కు విచారణ ఆదేశానికి రాష్ట్ర సర్కార్ సిద్ధం ?

కమిషన్ పరిశీలనకు కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రాజెక్టుపై అవకతవకల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ విచారణ కీలకం కానుంది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా, కాళేశ్వరం అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనుంది.

కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరాయి. విజిలెన్స్‌ విభాగం కూడా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను అధ్యయనం చేసి, ఇంజనీర్లు/ఐఏఎ్‌స/మాజీ ఐఏఎ్‌సలు, ప్రజా సంఘాలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశాక కేసీఆర్‌, హరీశ్‌లను విచారణకు పిలుస్తారు.

Join WhatsApp

Join Now