సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండ లో రైతు రుణమాఫీ జరగలేదని తెలంగాణ తల్లి విగ్రహా సాక్షి గా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేసి నిరసన తెలిపారు.వజ్జేపల్లి తాండలో మూడు విడతల్లో రుణమాఫీ చేసిన తమ గ్రామంలో ఇంకా రుణమాఫీ కాలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటోలా ఉందన్నారు. రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.రైతు ద్రోహి రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలనీ రైతులు డిమాండ్ చేశారు.
రుణమాఫీ జరగలేదని వజ్జెపల్లి తాండ లో రైతుల నిరసన… సీఎం దిష్టి బొమ్మ దహనం…
by admin admin
Published On: August 18, 2024 12:55 pm