*కబ్జా రహదారి కోసం సామాజిక కార్యకర్త శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష*
*అధికారుల హామీతో దీక్ష విరమించిన సామాజిక కార్యకర్త సిలివేరు*
*జమ్మికుంట ఏప్రిల్ 30 ప్రశ్న ఆయుధం*
జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డు లోని సర్వే నంబర్ 793/ఎ/2, 793/బి లో గల స్మశాన వాటిక కు దారి స్థలము కబ్జా విషయమై సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.గత కొద్దిరోజులుగా మోత్కులగూడెం గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు వెళ్లే రహదారిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించారని వెంటనే దానిని తొలగించాలంటూ అధికారుల చుట్టూ తిరిగిన వారు స్పందించకపోవడంతో పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం దగ్గర సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.దీక్షకు సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ, పోడేటి రామస్వామి, కొండ్లె పాపయ్య, మంద సాంబయ్య, పరిమెల కిషోర్ వివిధ సామాజిక, ఉద్యమ, కుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.విషయం తెలుసుకున్న అధికారులు రహదారి విషయంలో అధికారులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ నిరాహార దీక్షను విరమించుకున్నారు అనంతరం సిలివేరు శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఎం.పీ.ఆర్ గార్డెన్ సమీపాన ఉన్న హిందూ స్మశాన వాటికకు సంబంధించి ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించే లక్షలాది రూపాయల విలువైన దారిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన స్థలాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన సంబంధిత సమస్య విషయంలో ఎలాంటి చర్యలు లేనందున బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు ఇట్టి దీక్ష విషయమై జిల్లా ఉన్నత అధికారుల ఆదేశానుసారం స్థానిక తహసిల్దార్ జి. రమేష్ బాబు స్థానిక పట్టణ సి.ఐ వరంగంటి రవి లు తమ సిబ్బందితో దీక్ష శిబిరం వద్దకు చేరుకొని సంబంధిత సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిoచీ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ దీక్షను విరమింప చేశారని తెలిపారు. న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీకాంత్ అన్నారు.